ఆ కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది

మణిరత్నం- రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దళపతి' ఒక కల్ట్ క్లాసిక్‌గా పరిగణిస్తారు.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 9:13 AM IST
ఆ కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది

మణిరత్నం- రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దళపతి' ఒక కల్ట్ క్లాసిక్‌గా పరిగణిస్తారు. ఈ సినిమా కోలీవుడ్‌లో రజనీకాంత్ స్టార్‌డమ్ స్థాయిని మరింత పెంచుతూ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ సినిమా పాటలకు ఇప్పటి జనరేషన్ కూడా ఫిదా అయిపోయారు. ఇక రీరిలీజ్‌ల ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు దళపతి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

రజనీకాంత్ పుట్టినరోజున ఈ ఏడాది డిసెంబర్ 12న దళపతిని మళ్లీ విడుదల చేయనున్నారు. రజనీ అభిమానులకు ఇది తప్పకుండా పెద్ద పుట్టినరోజు కానుక అవుతుంది. అప్పట్లో ఈ సినిమాను థియేటర్లలో చూడని వారికి మళ్లీ చూసే అవకాశం కూడా . ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దళపతికి లభిస్తున్న పాపులారిటీ కారణంగా రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ ను సాధిస్తుందని అంచనా వేయొచ్చు.

కోలీవుడ్ రీ-రిలీజ్ కేటగిరీలో విజయ్ నటించిన గిల్లీ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది గిల్లీ. మరి ఈ రికార్డును దళపతి సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Next Story