ఆ వివాదానికి అలా ఎండ్ కార్డు వేసిన నటకిరీటి

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'హ‌రిక‌థ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

By Kalasani Durgapraveen  Published on  11 Dec 2024 9:45 AM GMT
ఆ వివాదానికి అలా ఎండ్ కార్డు వేసిన నటకిరీటి

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'హ‌రిక‌థ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. మంచికంటే చెడు చేసే వారినే హీరోలుగా అభిమానిస్తారనే ఉద్దేశ్యం వచ్చేలా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా పుష్ప సినిమాను ఉదాహరణగా చెప్పారు. ఇటీవ‌ల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ వివాదంపై తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్‌ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడాన‌ని వ‌చ్చిన వార్త‌లు చూసి న‌వ్వుకున్న‌ట్లు తెలిపారు. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఒక్క వివాదం లేదు క‌దా కొత్త‌గా ఇది వ‌చ్చిందంటూ ఎంజాయ్ చేశాన‌న్నారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అన‌లేదని, బ‌న్నీ త‌న‌కు కొడుకు లాంటి వాడ‌న్నారు. అల్లు అర్జున్‌ నువ్వు నా బంగారం.. ల‌వ్ యూ అని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో నవ్వుల నెలరాజు రాజేంద్ర ప్రసాద్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

Next Story