త్వరలో రాహుల్ రామకృష్ణ పెళ్లి.. అర్జున్‌రెడ్డి స్టైల్‌లో
Rahul Ramakrishna Announces Wedding With A Liplock Pic.ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటి వాడు
By తోట వంశీ కుమార్
ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కాబోయే భార్యకి లిప్ లాక్ ఇస్తూ తీసిన ఫోటో పోస్ట్ చేసి 'ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోనున్నాం.' అని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. అయితే.. తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
ఈ ఫోటో చూసిన నెటీజన్లు కంగ్రాట్స్ చెబుతూనే.. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'ఇదేంటీ భయ్యా.. ఇలా చేశావు' అని ఒకరు, 'ఈ తరహాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన తొలి వ్యక్తివి నువ్వే' అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు. 'ఎంత అర్జున్‌రెడ్డి సినిమాలో నటిస్తే మాత్రం ఇలా చెప్పాలా' అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా నీకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
'అర్జున్‌రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. 'అర్జున్ రెడ్డి', 'జాతి రత్నాలు', 'హుషారు' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాహుల్ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.