పెళ్లైన 12 ఏళ్లకు తల్లైన హీరోయిన్
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తల్లి అయ్యింది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 8:45 AM ISTబాలీవుడ్ నటి రాధికా ఆప్టే తల్లి అయ్యింది. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాధిక.. తన వ్యక్తిగత జీవితాన్ని లైమ్‌లైట్‌కి దూరంగా ఉంచుతుంది. నెలల తరబడి తన ప్రెగ్నెన్సీని దాచిపెట్టి.. ఓ ఈవెంట్‌లో అభిమానులకు ఈ శుభవార్త చెప్పిన ఆమె.. ఇప్పుడు ఓ పోస్ట్ ద్వారా ప్రకటించింది.
రాధికా ఆప్టేకు పెళ్లయిందని చాలా ఏళ్ల తర్వాత అభిమానులకు తెలిసింది. దీనికి కారణం ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే.. 12 ఏళ్ల క్రితం బెనెడిక్ట్ టేలర్‌ను ఆమె పెళ్లాడింది. వివాహం అయిన దశాబ్ధం తర్వాత.. రాధిక, బెనెడిక్ట్‌లు తల్లిదండ్రులయ్యారు. ఈ మేరకు లాప్‌టాప్ పట్టుకుని కూతురిని లాలిస్తున్న ఫోటోను రాధిక ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఫోటోను షేర్ చేస్తూ.. "పుట్టిన తర్వాత నా బిడ్డను మొదటిసారి నా హృదయానికి అతుక్కొని నేను పనికి తిరిగి వచ్చాను" అని క్యాప్షన్‌లో రాసింది. దీంతో పాటు.. ఆమె తల్లిపాలు, పనిలో ఉన్న తల్లి, ఆడపిల్ల, అమ్మాయిలు ఉత్తమం వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించింది. ఇవన్ని చూస్తుంటే.. ఆడపిల్ల పుట్టడంతో రాధికా చాలా సంతోషంగా ఉందని తెలుస్తుంది.