"రాధేశ్యామ్" నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్

Radhe Shyam’s Love Anthem release date is confirmed. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆప్‌డేట్‌ వచ్చింది. వన్‌ హార్ట్‌ టూ హార్ట్‌ బీట్స్‌ సాంగ్‌ విడుదలకు ముందు దాని టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు.

By అంజి  Published on  28 Nov 2021 6:42 AM GMT
రాధేశ్యామ్ నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సినిమా 'రాధే శ్యామ్‌' ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా మోస్ట్‌ గ్లామరస్‌ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆప్‌డేట్‌ వచ్చింది. వన్‌ హార్ట్‌ టూ హార్ట్‌ బీట్స్‌ సాంగ్‌ విడుదలకు ముందు దాని టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటలకు హిందీలో, అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో రాత్రి 7 గంటలకు విడుదల కానుంది. ఈ ప్రేమ గీతాన్ని సిద్ శ్రీరామ్ అన్ని దక్షిణ భారతీయ భాషలలో, హిందీలో అర్జిత్ సింగ్ పాడారు.

రాధే శ్యామ్ సినిమా బృందం ప్రమోషన్స్‌లో భాగంగా డిసెంబర్ 2021లో పలు అప్‌డేట్‌లను అందజేయనుంది. ఈ సినిమా జనవరి 14, 2022న గ్రాండ్‌గా విడుదల కానున్నది. అభిమానుల కోరిక మేరకు ఇప్పటికే ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేసిన మూవీ మేకర్స్‌.. తాజాగా రెండో సాంగ్‌కి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో 'రాధే శ్యామ్'సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పకులుగా ఉన్నారు. సినిమా నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీద, సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు.


Next Story
Share it