ప్ర‌భాస్ అభిమానులు ఓపిక‌తో ఉండాల‌ని కోరుతున్న 'రాధేశ్యామ్' డైరెక్ట‌ర్‌

Radhe Shyam Director wants darling fans to be patient.రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్' టీజర్ గురించి ఓపిక‌తో ఉండాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2021 10:00 AM GMT
Radhe Shyam

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. పిరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా తెర‌కెక్కుతున్న ఈచిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్ - ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు నిర్మాత‌లు స‌న్నాహ‌కాలు చేస్తున్నారు.

రాధేశ్యామ్ సినిమా పోస్టర్ ఒక్కొక్కటీ విడుదల అవుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిని మించి పోతున్నాయి. ఇందులో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. దాంతో ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్స్‌ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌ తన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.


'టీజర్ గురించిన అప్ డేట్ అతి త్వరలోనే మీ ముందుంటుంది. అంతవరకూ కాస్త ఓపిక పట్టండి. మీ ఓపికకు న్యాయం చేకూర్చేలా ఆ టీజర్ ఉంటుందని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. కాగా 'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.


Next Story
Share it