సెన్సార్ పూర్తి చేసుకున్న'పుష్ప' రాజ్.. 12న ఫ్రీరిలీజ్ ఈవెంట్‌

Pushpa The Rise censored with U/A certificate.ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 6:37 AM GMT
సెన్సార్ పూర్తి చేసుకున్నపుష్ప రాజ్.. 12న ఫ్రీరిలీజ్ ఈవెంట్‌

ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రెండు భాగాల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తొలి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ చిత్ర రన్ టైం దాదాపుగా 3 గంటలు ఉన్నట్టు సమాచారం.

ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఈ నెల 12న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడాలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో ఈ వేడ‌క‌ను నిర్వ‌హించ‌న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దీని కోసం ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విల‌న్ ఫాహ‌ల్ ఫాజిల్ న‌టిస్తుండ‌గా.. జ‌గ‌తిబాబు, సునీల్‌, అన‌సూయ లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక స్టార్ హీరోయిన్ స‌మంత ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది.

Next Story
Share it