దేవిశ్రీ సంచలన వ్యాఖ్యలపై పుష్ప నిర్మాత స్పందన

దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన 'పుష్ప: ది రూల్' ఈవెంట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  27 Nov 2024 2:54 PM IST
దేవిశ్రీ సంచలన వ్యాఖ్యలపై పుష్ప నిర్మాత స్పందన

దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన 'పుష్ప: ది రూల్' ఈవెంట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మైత్రి రవిశంక‌ర్‌కు త‌న‌పై కంప్లైంట్స్ ఎక్కువ‌య్యాయ‌ని దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మైత్రి నిర్మాత ర‌విశంక‌ర్ స్పందించారు. దేవిశ్రీతో త‌మ‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని, భ‌విష్య‌త్తులో ఆయ‌న‌తో క‌లిసి సినిమాలు చేస్తామ‌న్నారు. దేవి శ్రీ ప్రసాద్ అన్న‌దాంట్లో తమకు త‌ప్పు క‌నిపించ‌లేదని, ప్రేమ‌తో పాటు ఫిర్యాదులు ఉంటాయి. దేవిశ్రీ అదే చెప్పారు. అంతే త‌ప్పితే ఆయ‌న‌కి వేరే ఉద్దేశం లేదన్నారు మైత్రి రవి శంకర్.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024న విడుదల కాబోతోంది. పుష్ప 2 సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పుష్ప: ది రైజ్ భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠభరితమైన కథనం, పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్‌లు, అద్భుతమైన డైలాగ్స్‌తో ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story