అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ‘పుష్ప’ నటుడు రాజశేఖర్ అనింగి స్పందించారు. బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రకాల నిబంధనలు పాటించాలని చెప్పారు.
ఇక పుష్ప సినిమాలో బన్నీతో కలిసి నటించిన రాజశేఖర్ అల్లు అర్జున్ గురించి ఒక వీడియో విడుదల చేశారు. రాజశేఖర్ అనింగి మాట్లాడుతూ పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ గారితో కలిసి నాలుగేళ్ల పాటు పనిచేశానన్నారు. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ అని కూడా చూడకుండా ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
షూటింగ్ విరామ సమయంలో ప్రొడక్షన్ బాయ్స్ స్నాక్స్ పట్టుకొచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏ మాత్రం ఆలోచించకుండా నేరుగా వెళ్లి స్పాట్ బాయ్స్‌తో కలిసి స్నాక్స్ తింటారు. అంతటి నిరాడంబరమైన వ్యక్తి కళ్ళలోకి చూడొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని రూల్స్ పెడతారంటే ఎవరూ నమ్మరన్నారు. అల్లు అర్జున్ సెట్‌లోకి రాగానే ప్రతి చిన్న టెక్నీషియన్‌ను, ఆర్టిస్టును పేరుపేరునా పలకరిస్తారని రాజశేఖర్ తెలిపారు.