'పుష్ప-2' థియేటర్‌లో మిస్టీరియస్ 'స్ప్రే' కలకలం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పుష్ప-2'. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
By అంజి Published on 6 Dec 2024 12:00 PM IST'పుష్ప-2' థియేటర్‌లో మిస్టీరియస్ 'స్ప్రే' కలకలం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పుష్ప-2'. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముంబైలోని ఓ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో స్ప్రే కలకలం సృష్టించింది. దీంతో ప్రేక్షకులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే సదరు యాజమాన్యం వెంటనే షోను నిలిపివేసింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్‌లో అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ స్క్రీనింగ్ మిస్టీరియస్ స్ప్రే కారణంగా డిసెంబర్ 5న ఆగిపోయింది. అనంతరం ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రకారం.. విరామం తర్వాత 15-20 నిమిషాల పాటు స్క్రీనింగ్ నిలిపివేయబడింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 రన్‌టైమ్ మూడు గంటల 21 నిమిషాలు .
గుర్తు తెలియని వ్యక్తి దగ్గు, గొంతు చికాకు, వాంతులు కలిగించే పదార్థాన్ని స్ప్రే చేశాడు. ఫిర్యాదులు రావడంతో షో ఆగిపోయింది. పరిస్థితి సాధారణమైన తర్వాత స్క్రీనింగ్ తిరిగి ప్రారంభమైంది. థియేటర్‌లో ఏ స్ప్రే ఉపయోగించారనే దానిపై పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని సోర్సెస్ తెలిపాయి. బయట బహిరంగ ప్రదేశంలో వాడాల్సిన స్ప్రేని థియేటర్‌లో వాడినట్లు అనుమానిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న సినిమా థియేటర్లలో విడుదలైంది.