హిందీ మార్కెట్‌లో 'పుష్ప-2' విధ్వంసమే

పుష్ప-2 సినిమా హిందీలో రికార్డ్ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు, తమిళం, కర్ణాటకలో కూడా మంచి వసూళ్లను సాధించింది.

By అంజి  Published on  9 Dec 2024 1:32 PM IST
Pushpa-2 movie, Hindi, Bollywood

హిందీ మార్కెట్‌లో 'పుష్ప-2' విధ్వంసమే 

పుష్ప-2 సినిమా హిందీలో రికార్డ్ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు, తమిళం, కర్ణాటకలో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మొదటి వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి రోజు ఈ సినిమా 280 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2వ రోజు 140 కోట్లు రాబట్టగా, 3వ రోజు 165 కోట్లు వచ్చాయి. ఆదివారం నాడు 185 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజులలో కలెక్షన్లు 770 కోట్ల రూపాయల గ్రాస్ తాకిందని తెలుస్తోంది.

ఒక భారతీయ చిత్రానికి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లుగా చెప్పొచ్చు. పుష్ప 2 ఈ వారం 1000 కోట్ల మార్క్‌ను దాటడం చాలా సులువు. త్వరలో 1000 కోట్ల మార్క్‌ను సాధించి, అత్యంత వేగంగా ఆ రికార్డు అందుకున్న చిత్రంగా అవతరించనుంది. హిందీ మార్కెట్ నుండి వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ కారణంగా బాహుబలి 2 కలెక్షన్స్ కూడా పుష్ప-2 అందుకునే అవకాశం ఉంది.

Next Story