పుష్ప-2 సినిమా హిందీ బెల్ట్ తో దుమ్ముదులుపుతూ ఉంది. బుక్ మై షో యాప్ లో సినిమా టికెట్లను భారీగానే కొంటున్నారు. బుక్ మై షోలో పుష్ప 2 సినిమా 2 కోట్ల టిక్కెట్ విక్రయాలను దాటింది. బుక్ మై షోలో 2 కోట్ల కంటే ఎక్కువ టిక్కెట్లు విక్రయించిన మొదటి చిత్రంగా పుష్ప-2 సినిమా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లను దాటింది.
బాహుబలి-2 సినిమా రికార్డులను కూడా పుష్ప-2 బద్దలు కొట్టింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమాలలో అతిపెద్ద బ్లాక్‌స్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దంగల్ తర్వాత ఈ సినిమా నిలిచింది. పుష్ప 2 అసాధారణమైన బాక్సాఫీస్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు చేరుకుంది.