తమ్ముడు పునీత్‌పై ప్రేమ‌ను చాటుకున్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌

Puneeth Rajkumar’s elder brother Raghavendra pay tribute to late actor. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరు. పునీత్ ను అభిమానులే

By M.S.R  Published on  31 May 2023 8:30 PM IST
తమ్ముడు పునీత్‌పై ప్రేమ‌ను చాటుకున్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌

Puneeth Rajkumar’s elder brother Raghavendra pay tribute to late actor

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరు. పునీత్ ను అభిమానులే అసలు మరచిపోలేకుంటే.. ఇక ఆయన కుటుంబ సభ్యులు అసలు మరచిపోగలరా చెప్పండి. పునీత్‌ సోదరులు శివరాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ ప్రతి సినిమా ఈవెంట్‌లో తమ్ముడిని తలచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌. తన తమ్ముడిని ఎప్పటికీ గుర్తించుకోవడం కోసం రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్‌ రాజ్ కుమార్ ముద్దు పేరు. కన్నడ నాట పునీత్ ను ఎంతో ఆప్యాయంగా అప్పు అని పిలుస్తూ ఉంటారు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్‌ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. రాఘవేంద్ర తన తమ్ముడు పునీత్ పై ఇలా ప్రేమను చాటుకున్నాడు. 46 వయసులో పునీత్‌ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయారు. ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు.


Next Story