హీరో మరణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అభిమాని

Puneeth Rajkumar Fan Committed For Suicide. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. కర్ణాటకకు చెందిన

By M.S.R  Published on  30 Oct 2021 9:53 AM GMT
హీరో మరణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అభిమాని

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. బెళగావి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పునీత్‌ మరణవార్త విని ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్లు సమాచారం. పునీత్ కు వీరాభిమాని అయిన వ్యక్తి.. తన అభిమాన నటుడు చనిపోయాడనే విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పునీత్‌ మరణవార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. మునియ‌ప్ప‌న్ అనే 30 ఏళ్ల వ్యక్తి పునీత్‌ మరణవార్త విని కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉడిపి జిల్లా సాలిగగ్రామానికి చెందిన మరో అభిమాని సతీష్‌(35)సైతం పునీత్‌ మరణవార్త విని గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

46 ఏళ్ల వయసులోనే పునీత్ తనువు చాలించడం అందరినీ కలచి వేస్తోంది. ఆయన గౌరవార్థం బెంగళూరు నగరం షట్ డౌన్ అయిపోయింది. పునీత్ కు నివాళి అర్పిస్తూ నగరంలోని షాపులను ఎవరికి వారు మూసివేశారు. అభిమానుల సందర్శనార్థం నగరంలోని కంఠీరవ క్రికెట్ స్టేడియంలో పునీత్ పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనను చివరిసారి చూసుకునేందుకు వేలాదిమంది స్టేడియంకు తరలి వస్తున్నారు.


Next Story