అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బిగ్‌బాస్ బ్యూటీ పున‌ర్న‌వి.. ఇదే చివ‌రిది కావాలంటూ పోస్ట్‌

Punarnavi Bhupalam Suppress Chest Congestion.పునర్నవి భూపాలం అని పేరు చెబితే వెంట‌నే గుర్తు ప‌ట్టేవారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2023 11:44 AM IST
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బిగ్‌బాస్ బ్యూటీ పున‌ర్న‌వి.. ఇదే చివ‌రిది కావాలంటూ పోస్ట్‌

పునర్నవి భూపాలం అని పేరు చెబితే వెంట‌నే గుర్తు ప‌ట్టేవారి సంఖ్య త‌క్కువే అయిన‌ప్ప‌టికీ చూస్తే మాత్రం ఈ బ్యూటీనా అంటూ అంద‌రూ గుర్తుప‌ట్టేస్తారు. సినిమాల్లో న‌టించిన పెద్ద‌గా గుర్తింపు రాలేదు గానీ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 3తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైంది. ఏ విష‌యంలోనైనా చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది అమ్మ‌డు. అయితే.. తాను ఓ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు చెప్పి కొత్త సంవ‌త్స‌రంలో త‌న అభిమానుల‌కు షాకిచ్చింది.

"కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల‌కు సంబంధించిన‌ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నా. కొత్త సంవ‌త్స‌రాన్ని ఇలా ప్రారంభిస్తున్నా. చాలా రోజులు అనారోగ్యం పాలు కావ‌డం ఇదే తొలిసారి. ఇదే చివ‌రి సారి కావాల‌ని కోరుకుంటున్నా." అని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.


మ‌రో ఫోటో షేర్ చేస్తూ.. ఇప్ప‌టికి అనారోగ్యంగానే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ఆమె పోస్టుల‌ను చూసిన అభిమానులు, నెటీజ‌న్లు పున‌ర్న‌వి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


రాజ్‌త‌రుణ్ హీరోగా 'ఉయ్యాలా జంపాలా' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా న‌టించింది. ఆ త‌రువాత కొన్ని సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో 77 రోజుల పాటు హౌస్‌లో ఉంది. ఆ త‌రువాత ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. 'ఎందుకో ఏమో', 'ఒక చిన్న విరామం' కొన్ని చిత్రాల్లో న‌టించింది. ఆ త‌రువాత ఆఫ‌ర్ల‌కు నో చెప్పి ఉన్న‌త చ‌దువుల కోసం లండ‌న్‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం సైకాల‌జీలో హ‌య్య‌ర్ స్ట‌డీస్ చేస్తోంది. లండ‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో అభిమానులతో ట‌చ్‌లోనే ఉంటుంది. వీలు కుదిరిన‌ప్పుడు లైవ్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడుతోంది.

Next Story