సెట్స్ నుంచి పవన్ ఫోటో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!
PSPKRANA leaked still pawan kalyan jumping a wall.తాజాగా పవన్ షూటింగ్‌లోని ఓ ఫోటో లీకైంది. ఇందులో పవన్ కళ్యాణ్ గోడపై నుంచి దూకుతున్నట్లు కనిపిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 5 March 2021 9:45 AM GMT
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు లీకుల బెడద చాలా ఎక్కువైంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. ఆచిత్రంలోని ఫోటోలు, కొన్ని సీన్లు లీక్ అవుతున్నాయి. దీనిపై దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగాల్ పులితో పోరాటానికి సంబంధించిన కొన్ని పిక్స్ లీకై కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా.. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌లు కానీ ఫోటోలు కాని బయటకు రాలేదు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లోని ఓ ఫోటో లీకైంది. ఇందులో పవన్ కళ్యాణ్ గోడపై నుంచి దూకుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఆయన వెనకాల ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసి పవన్ అభిమానులు మురిసిపోతున్నారు.
పవన్ ఈ మూవీతో పాటు క్రిష్ జాగర్లముడి డైరెక్షన్‌లో #pspk27 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. పింక్ రీమేక్‌గా తెరకెక్కిన 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.