ప‌వ‌న్ క‌ల్యాణ్ -హ‌రీశ్ శంక‌ర్ మూవీ టైటిల్ ఫిక్స్‌.. ఫ‌స్ట్ లుక్ అదిరింది

PSPK 28 first look out.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2021 4:31 AM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ -హ‌రీశ్ శంక‌ర్ మూవీ టైటిల్ ఫిక్స్‌..  ఫ‌స్ట్ లుక్ అదిరింది

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీలుక్ విడుద‌ల చేసిన చిత్ర‌బృందం నేడు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ చిత్రానికి భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇక ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత హ‌రీశ్‌శంక‌ర్‌-ప‌వ‌న్ కాండినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్‌, ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా.. హీరోయిన్‌, మిగ‌తా న‌టీన‌టులు ఎవ‌రు అన్న విష‌యాల‌ను ఇంకా చిత్ర బృందం వెల్ల‌డించ‌లేదు.

Next Story
Share it