దిల్‌రాజు ఇంటికి వారసుడొచ్చాడు
Producer Dil Raju Becomes Father To A Baby Boy.తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2022 11:50 AM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. తాజాగా ఆయన మరోసారి తండ్రి అయ్యారు. బుధవారం ఉదయం ఆయన భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో ఆయన ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దిల్‌రాజు కి కొడుకు పుట్టాడనే విషయాన్ని తెలిజేస్తూ బండ్ల గణేష్.. 'దిల్‌రాజు అన్నా కాంగ్రాచులేషన్స్' అని ట్వీట్ చేశాడు.
Dil Raju annaaaaaaaaaa congratulations 🏹🏂🏆was blessed with a baby boy 👦 @SVCCofficial
— BANDLA GANESH. (@ganeshbandla) June 29, 2022
2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీరికి హన్సితా రెడ్డి అనే కుమార్తె ఉంది. కూతురు కోరిక మేరకు 2020 డిసెంబర్ 10న వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ గుడిలో అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ రెండు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో 'వారసుడు' సినిమా. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మరొకటి రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం.