ఇన్ కం ట్యాక్స్ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్‌ రాజు

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

By Knakam Karthik
Published on : 4 Feb 2025 10:35 AM IST

Tollywood, Entertainment, Producer Dilraju, Income Tax, It Raids

ఇన్ కం ట్యాక్స్ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్‌ రాజు

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. వ్యాపారాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఐటీ అధికారులు దిల్ రాజుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం.

సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేశారు. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు సంబంధించిన పలువురు దర్శక, నిర్మాతల నివాసాల్లోనూ నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

Next Story