టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Producer C Kalyan unhappy with AP Govt decision on movie tickets.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల సినిమా టిక్కెట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 9:53 AM IST
టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. దీనిపై సినీప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు నిర్మాత‌లు అసంతృప్తిగా ఉన్నారు. కొంద‌రు లో లోప‌ల మ‌ద‌న‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు బాహాటంగానే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌ని.. టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంతో ప‌రిశ్ర‌మ ఇప్ప‌ట్లో కోలుకోలేద‌ని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సినీ నిర్మాత సి.క‌ళ్యాణ్ టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై స్పందించారు.

టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం బావించ‌వ‌చ్చున‌ని.. కానీ నిర్మాత‌గా తాను తాను త‌యారు చేసుకున్న వ‌స్తువును తానే రేటును నిర్ణ‌యించుకునే వెసులుబాటు ఉండాల‌న్నారు. ఆ వ‌స్తువు కొనాలా..? వ‌ద్దా..? సినిమాను చూడాలా..? వ‌ద్దా..? అన్న‌ది ప్రేక్ష‌కుల ఇష్ట‌మ‌న్నారు. కానీ మ‌రీ ఇంత‌లా ధ‌ర‌లు త‌గ్గించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. మ‌ళ్లీ ఓ సారి సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామ‌న్ని చెప్పారు.

ఈ స‌మ‌స్య త్వ‌ర‌లోనే స‌మ‌సిపోతుంద‌ని అనుకుంటున్నాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అఖండ విజయం గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఏ గోలతో సంబంధం లేకుండా థియేటర్‌లకు వెళ్లి సినిమాలను ఆస్వాదిస్తారని ఈ చిత్రం రుజువు చేసిందన్నారు. తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మీడియా ప్రశ్నించగా.. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ 'శంకరాచార్య'ని నిర్మించాలని ఆలోచిస్తున్నానని.. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నానని కళ్యాణ్ తెలిపారు.

ఆన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ మంచిదేన‌ని..దాని వ‌ల్ల ఏ స‌మ‌స్య లేద‌ని నిర్మాతలు నారాయణ్‌ దాస్‌ కే. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. తెలంగాణలో టికెట్‌ ధరలు బాగున్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఏపీలో పరిస్థితి బాగాలేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెబుతూనే... త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

Next Story