క్షమించమని అడిగిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.
By - Knakam Karthik |
క్షమించమని అడిగిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ఇటీవల 'కె రాంప్' సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో ఆయన స్పందించారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఇటీవల 'కె రాంప్' సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే" అని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలో అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు.
'కె రాంప్' కార్యక్రమంలో బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను ఉద్దేశించినవేనని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయ్ అభిమానులు బండ్ల గణేష్ గురించి పలు కామెంట్లు చేశారు.