సలార్-2 మీద అంచనాలు పెంచేసిన పృథ్వీ రాజ్

భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్ 2'. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు

By Medi Samrat  Published on  8 May 2024 5:19 PM IST
సలార్-2 మీద అంచనాలు పెంచేసిన పృథ్వీ రాజ్

భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్ 2'. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రాణస్నేహితులు.. బద్ధ శత్రువులుగా ఎలా మారారనేది సలార్-2లో మనం చూడబోతున్నాం. సలార్ 2 ఖాన్సార్ రహస్యాలను విప్పబోతోంది. సలార్ సీక్వెల్ ఈ ఏడాది జూన్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.

పృథ్వీరాజ్ సలార్ 2 షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని ధృవీకరించారు. పార్ట్ 1 షెడ్యూల్‌లో పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని భాగాలు ఇప్పటికే చిత్రీకరించారు. తక్కువ రోజుల్లోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. పృథ్వీరాజ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ అభిమానులలో మరిన్ని అంచనాలను సృష్టించింది. ప్రశాంత్ నీల్ వ్రాసిన శివ మన్నార్ పాత్ర చాలా గొప్పగా ఉందని.. అది మరొక యూనివర్స్ తో క్రాస్ఓవర్ కలిగి ఉందని చెప్పాడు. దీంతో ఈ సినిమాకు కేజీఎఫ్ తో సంబంధమా.. లేక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాతో సంబంధమా అనేది అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. పృథ్వీరాజ్, జగపతి బాబుతో కలిసి ప్రభాస్ నటించిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Next Story