గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'సలార్' టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'సలార్' సినిమా టీజర్ విడుదలైంది.
By అంజి Published on 6 July 2023 6:47 AM ISTగూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'సలార్' టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'సలార్' సినిమా టీజర్ విడుదలైంది. గురువారం ఉదయం 5 గంటల 12 నిమిషాలకు ఈ టీజర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ మొత్తం ఇంటెన్స్‌గా సాగింది. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా కేజీఎఫ్ సినిమాను మించేలా కనిపిస్తోంది. ప్రభాస్‌లోని హీరోయిజాన్ని పతాక స్థాయిలో హైలెట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. చాలా మంది గన్స్‌తో చుట్టు ముట్టగా టినూ ఆనంద్ స్టోరీ చెప్పడంతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. సింపుల్ ఇంగ్లీష్.. నో కన్ఫ్యూజన్.. లైగర్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డెంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. బికాజ్ ఇన్ దట్ పార్క్ దేర్ ఈజ్ ఏ.. అంటూ అతడు డైలాగ్ ఆపడంతోనే ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు.
ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. సలార్ పార్ట్ - 1 ceasefire అని టీజర్ చివర్లో టైటిల్ వేశారు. టీజర్ చూస్తుంటే ప్రభాస్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్ చివరిలో విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించాడు. యాక్షన్ సీన్స్‌తో వచ్చిన టీజర్.. రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, వరదరాజా మన్నార్ అనే పాత్రలో అతడు కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ మెయిన్ రోల్‌ను పోషిస్తున్నాడు. హీరోయిన్ శృతిహాసన్ ఆద్య అనే జర్నలిస్టుగా కనిపించబోతోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ 'సలార్' సినిమాను నిర్మిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.