జై హనుమాన్.. ఏకంగా ఐమాక్స్ త్రీడీలో.!

హనుమాన్‌ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత అందరి దృష్టి ఇప్పుడు జై హనుమాన్‌ సీక్వెల్‌పై పడింది. జై హనుమాన్ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేశారు

By Medi Samrat  Published on  24 April 2024 10:00 AM IST
జై హనుమాన్.. ఏకంగా ఐమాక్స్ త్రీడీలో.!

హనుమాన్‌ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత అందరి దృష్టి ఇప్పుడు జై హనుమాన్‌ సీక్వెల్‌పై పడింది. జై హనుమాన్ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేశారు.ఈ సినిమా భారీ కాన్వాస్‌పై రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, ప్రముఖ టెక్నీషియన్లు భాగం కానున్నారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున ప్రశాంత్ వర్మ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్‌లో హనుమంతుడు కొండపై ధైర్యంగా నిలబడి చేతిలో గద్దతో ఉన్నాడు, అగ్నిని వదిలే డ్రాగన్ ఆయనను సమీపిస్తున్నట్లు మనం చూడొచ్చు. ప్రశాంత్ వర్మ మొదటిసారిగా తెలుగు స్క్రీన్‌పైకి డ్రాగన్‌లను తీసుకువస్తున్నాడు. ఈ పోస్టర్ ఖచ్చితంగా చిత్రానికి హైప్‌ని తెచ్చిపెట్టింది. టాప్-ఎండ్ VFX, ఇతర సాంకేతికతలతో చిత్రాన్ని అద్భుతంగా మలచడానికి ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ ప్రయత్నిస్తూ ఉంది. జై హనుమాన్ ఐమాక్స్ 3డిలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story