'మా' ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
Prakash Raj tweet on MAA elections controversy.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం మరో కీలక మలుపు
By తోట వంశీ కుమార్ Published on
22 Oct 2021 9:43 AM GMT

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం మరో కీలక మలుపు తిరిగింది. మా ఎన్నికల్లో వైసీపీ జోక్యం ఉందంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల హాల్‌లో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడని.. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని.. జగ్గయ్యపేటకు చెందిన వాడన్నారు. అతడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. అంతేకాదు ఏపీ సీఎం జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్‌కి ఓట్లు వేశారని చెప్పారు.
'మా ఎలక్షన్స్ 2021.. ప్రియమైన ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ పుటేజీ ఇవ్వండి. ఎన్నికలు ఎలా జరిగాయో ప్రపంచానికి తెలిసేలా చేయండి' అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కొన్ని ఫోటోలను దానికి జత చేశారు.
Next Story