నేను దేవుడిని నమ్మను : ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన తల్లికి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో బదులిచ్చారు.

By -  Medi Samrat
Published on : 2 April 2026 5:30 PM IST

నేను దేవుడిని నమ్మను : ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన తల్లికి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన "నాకు దేవుడిపై నమ్మకం లేదు" అని స్పష్టం చేశారు.

తన తల్లి మృతి చెందిన తర్వాత ఆమెకు క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు చేయడం పట్ల కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన ఆయన.. తన తల్లి క్రైస్తవ మతాన్ని స్వీకరించారని, ఆమె విశ్వాసాలు, చివరి కోరిక మేరకే ఆ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశామని బదులిచ్చారు. అంతేకాకుండా, తాను నాస్తికుడినని, తనకు దేవుడిపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. తన తల్లికి ఇష్టమైన పద్ధతిలో ఆమెకు తుది వీడ్కోలు పలకడం ఒక కొడుకుగా తన బాధ్యత అని తెలిపారు.

Next Story