పోకిరి సీన్ రిపీట్‌.. బ్ర‌హ్మీ కాదు ప్ర‌గ్యా.. వీడియో వైర‌ల్

Pragya Jaiswal mobbed by Beggars in hyderabad.పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన పోకిరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 12:07 PM GMT
పోకిరి సీన్ రిపీట్‌.. బ్ర‌హ్మీ కాదు ప్ర‌గ్యా.. వీడియో వైర‌ల్

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన 'పోకిరి' సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఇక ఆచిత్రంలో యాచ‌కులు అంద‌రూ బ్ర‌హ్మానందం వెంట‌ప‌డే సీన్ ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుండే ఉంటుంది. తాజాగా అలాంటి ఘ‌ట‌న‌నే నిజ జీవితంలో ఎదుర్కొంది న‌టి ప్ర‌గ్యా జైస్వాల్‌. దానం చేయాలంటూ ఆమె వెనుక ప‌డ్డారు. కారు ఎక్కినా అద్దాలు క్లోజ్ చేయ‌కుండా చేయి అడ్డుపెట్టారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రోజూ మాదిరే జిమ్‌ సెంటర్‌కి వెళ్లింది ప్రగ్యా జైస్వాల్‌. క‌స‌ర‌త్తులు ముగిశాక బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే.. అప్పటికే అక్క‌డ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచ‌కులు డ‌బ్బు ఇవ్వాలంటూ వెంటపడ్డారు. వారిని చూసి ఇబ్బందిపడ్డ ప్రగ్యకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతలో వాళ్లంతా ఆమె చుట్టూ చేరి ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కుండా నిల‌బ‌డ్డారు. వారి నుంచి తప్పించుకుని ఆమె వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. చివ‌ర‌కు ఎలాగోలా కారులోకి వెళ్లి కూర్చుంది. అయినా కూడా వాళ్లు వదలకుండా వెళ్లి.. కారు కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి చేతులు చాపారు. ఇక లాభం లేదనుకుని కొంత డబ్బు తీసి, వారిలో కొంద‌రికి ఇచ్చిన ప్రగ్య అంద‌రూ పంచుకోవాల‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ కారు వెళ్తున్న స‌మ‌యంలోనూ ఇంకా డ‌బ్బు ఇవ్వాలంటూ యాచ‌కులు ఆమె వెంట ప‌డ్డారు. ​ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


ఇదిలా ఉంటే.. ప్ర‌గ్యా జైస్వాల్ ప్ర‌స్తుతం బాల‌య్య 'అఖండ' చిత్రంలో న‌టిస్తోంది. బోయ‌పాటు శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story
Share it