బాల‌య్య స‌ర‌స‌న కంచె భామ‌

Pragya jaiswal in BB3 movie.నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ హైవోల్టేజ్ యాక్ష‌న్ BB3 లో బాల‌య్య స‌ర‌స‌న కంచె భామ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 2:48 PM IST
Pragya jaiswal in BB3 movie

నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ హైవోల్టేజ్ యాక్ష‌న్ సినిమా తెరకెక్కుతోంది. BB3 వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను వ‌చ్చేవారం పిడుగురాళ్ల‌లో షూట్ చేయ‌నున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. క‌రోనాకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన బాల‌య్య లుక్ ఒక‌టి వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.


ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఎవరు న‌టించ‌నున్నారు అనేది తెలిసిపోయింది. ఇన్నాళ్లు.. అంజ‌లి, సిమ్రాన్‌, స్నేహా అంటూ వార్త‌లు వినిపించాయి. అయితే.. వాటికి చిత్ర బృందం నేడు పుల్‌స్టాప్ పెట్టింది. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్బంగా ద్వారకా క్రియేషన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియస్తూ అధికారికంగా అనౌన్స్ మెంట్ చేసింది. ఇద్ద‌రు హీరోయిన్ల‌కు అవ‌కాశం ఉన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా పూర్ణ న‌టించే అవ‌కాశం ఉంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది తెలియ‌రాలేదు.


Next Story