కృష్ణంరాజు మ‌ర‌ణం త‌రువాత ప్ర‌భాస్ తొలి పోస్ట్‌.. ఎమోషనల్‌గా ఉన్న వీడియో

Prabhas shares a collage video of Krishnam Raju and his films.కృష్ణం రాజు మ‌ర‌ణం త‌రువాత ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2022 8:16 AM IST
కృష్ణంరాజు మ‌ర‌ణం త‌రువాత ప్ర‌భాస్ తొలి పోస్ట్‌.. ఎమోషనల్‌గా ఉన్న వీడియో

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవ‌ల క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అన్ని స‌మ‌యాల్లోనూ త‌న‌కు అండ‌గా ఉన్న పెద్ద‌నాన్న అకాల మ‌ర‌ణంతో ప్ర‌భాస్ దుఃఖంలో మునిగిపోయారు. షూటింగ్స్ కి కొంత‌ బ్రేక్ తీసుకున్న ప్రభాస్.. త‌న‌ని న‌మ్ముకుని ఉన్న నిర్మాత‌ల కోసం నిన్నటి నుంచి మ‌ళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కాగా.. కృష్ణం రాజు మ‌ర‌ణం త‌రువాత ప్ర‌భాస్ తొలిసారిగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

కృష్ణంరాజు, ప్రభాస్ చిత్రాల్లోని పలు సన్నివేశాలను జత చేస్తూ ఫ్యాన్స్ రూపొందించిన వీడియో అది. ఈ వీడియో ప్ర‌భాస్ వ‌ర‌కు చేర‌డంతో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను షేర్ చేస్తూ.. హ‌ర్ట్ సింబ‌ల్‌తో పాటు దండం పెడుతున్న ఎమోజీని పెట్టి అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

ఆ వీడియోలో.. ప్రభాస్, కృష్ణంరాజు ల ఎక్స్‏ప్రెషన్స్ నుంచి వారిద్దరి యాక్షన్ సన్నివేశాలు, పాట‌ల వరకు అన్ని సీన్స్ ఓకేలా ఉన్నాయి. అంతేకాకుండా.. వారి సీన్స్‏కు తగినట్టుగా బ్యాగ్రౌండ్‏లో ప్రభాస్ నటించిన సినిమాల సాంగ్స్ మరింత హైలెట్‏గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. మొగల్తూరులో ఈనెల 29న కృష్ణంరాజు స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ సభను పెద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా మొగల్తూరుకి వెళ్లనుంది. వీరంతా కొన్ని రోజులు పాటు అక్క‌డే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story