మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ ఒకే?
భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు హీరో ప్రభాస్. ఆయన సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
By అంజి Published on 28 May 2023 4:33 AMమరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ ఒకే?
భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు హీరో ప్రభాస్. ఆయన సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌కు ఒకే చెప్పినట్లు సమాచారం. 'సీతారామం' ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమాకు అంగీకారం చెప్పినట్టు గతంలోనే వెల్లడయింది. తాజాగా ఆ సినిమా నేపథ్యం, సినిమా నిర్మాణ సంస్థ వివరాలు కూడా బయటకు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఇదిలా ఉంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కూడా ప్రభాస్ సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్‌కు త్రివిక్రమ్ స్టోరీ లైన్ వినిపించారట. ఇక ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్‌కు సరికొత్తగా ఉండే స్టోరీ రూపుదిద్దుకోనుందట.
అయితే ఈ రెండు ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో పాటు, ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ రోజే 'సలార్' టీజర్‌ను విడుదలచేయబోతున్నట్లు తెలిసింది. 'సలార్' మూవీకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. 'సలార్'తో పాటు ప్రాజెక్ట్ కే మూవీ చేస్తోన్నాడు ప్రభాస్. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.