'ది రాజాసాబ్‌' నుండి బిగ్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తెన్న సినిమా 'ది రాజాసాబ్‌'.

By అంజి
Published on : 3 Jun 2025 10:54 AM IST

Prabhas,Rajasaab movie, Tollywood

'ది రాజాసాబ్‌' నుండి బిగ్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తెన్న సినిమా 'ది రాజాసాబ్‌'. తాజాగా ఈ మూవీ నుండి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్‌ 5వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అలాగే ఈ నెల 16వ తేదీ ఉదయం 10.52 గంటలకు టీజ్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు తెలియజేస్తూ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు.

రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్​ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ ఎస్‌ తమన్ సంగీతం అందిస్తున్నారు. అటు ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. వీటిలో హను రాఘవపూడి 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2898 AD' సీక్వెల్స్​తో బిజీగా ఉన్నారు.

Next Story