ప్ర‌భాస్ అభిమానుల‌కు పండ‌గే .. ప్రాజెక్ట్ కే నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

Prabhas Project K movie Release on 12th January 2024.నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 12:04 PM IST
ప్ర‌భాస్ అభిమానుల‌కు పండ‌గే .. ప్రాజెక్ట్ కే నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'ప్రాజెక్ట్‌-K' చిత్రం కూడా ఒక‌టి. వైజ‌యంతీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ‌ దీపికా ప‌దుకొణె న‌టిస్తుండ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. శ‌ర వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది.టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. భారీ ఆకారంలో ఉన్న చేతిపై కొంద‌రు గ‌న్స్ గురిపెడుతుండ‌గా, చుట్టు పక్కల పెద్ద పెద్ద మిషన్‌లు, కూలిపోయిన కొన్ని అపార్టుమెంట్స్ ఆ పోస్ట‌ర్‌లో చూడొచ్చు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ పోస్ట‌ర్‌తో సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు అన్ని రెట్టింపు అయ్యాయి.

Next Story