'అవెంజర్స్‌' తరహాలో ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె'.. రిలీజ్‌ అప్పుడే

Prabhas project K in the style of Avengers.. The producer gave clarity on the release of the movie. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది.

By అంజి
Published on : 28 July 2022 2:35 PM

అవెంజర్స్‌ తరహాలో ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె.. రిలీజ్‌ అప్పుడే

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది. ఈ మూవీపై నిర్మాత అశ్వనీ దత్‌ కీలక ప్రకటన చేశారు. ఈ మూవీని 'అవెంజర్స్‌' తరహాలో తెరకెక్కిస్తున్నామని, ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ అని తెలిపారు. తాజాగా వైజయంతి మూవీస్ నిర్మించిన 'సీతారామం' సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ చేపట్టింది. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్‌ 'సీతారామం' మూవీ గురించి మాట్లాడిన తర్వాత 'ప్రాజెక్టు కె' నుంచి బిగ్‌ అప్డేట్‌ ఇచ్చారు.

ఇంటర్నేషనల్‌ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో మూవీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌ కెకు సీక్వెల్‌ కూడా ఉండొచ్చన్నారు. 'అవెంజర్స్‌' తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ప్రభాస్‌ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ మూవీ చూశాక సినీ ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు. 2023 నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2024 జనవరిలో సినిమా విడుదల చేసేందుకు ప్లానింగ్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రిలీజ్ అవుతుందన్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్ కె'లో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

Next Story