'కల్కి 2898 ఏడీ' రిలీజ్‌ డేట్‌పై రూమర్స్‌.. క్లారిటీ ఇదే

'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల వాయిదా పడిందంటూ కొందరు ఫేక్‌ న్యూస్‌ను స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ విడుదల తేదీపై మరోసారి క్లారటీ ఇచ్చింది.

By అంజి  Published on  25 Feb 2024 12:25 PM IST
Prabhas, Kalki 2898 ad, film, Tollywood

'కల్కి 2898 ఏడీ' రిలీజ్‌ డేట్‌పై రూమర్స్‌.. క్లారిటీ ఇదే 

హీరో ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల వాయిదా పడిందంటూ కొందరు ఫేక్‌ న్యూస్‌ను స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ విడుదల తేదీపై మరోసారి క్లారటీ ఇచ్చింది. 'కల్కి 2898 ఏడీ' మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇది సోషియో ఫాంటసీ ఫిక్షన్‌ మూవీ.

ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ, పశుపతి లాంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలను ఎక్కువగా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా సినిమా వాయిదా రూమర్లపై చిత్రబృందం స్పందించింది. ప్రభాస్‌కి సంబంధించిన 'జస్ట్‌ ది వార్మ్‌ అప్‌' క్యాప్షన్‌తో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా మే 9నే 'కల్కి 2898 ఏడీ' విడుదల కానుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిస్తోంది.

Next Story