ప్ర‌భాస్ కొత్త సినిమా పిక్ లీక్‌..! వైర‌ల్‌

Prabhas joins the sets of Maruthi's film see leaked pic.బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్ర‌భాస్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 1:07 PM IST
ప్ర‌భాస్ కొత్త సినిమా పిక్ లీక్‌..! వైర‌ల్‌

బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్ర‌భాస్‌. దీని త‌రువాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. 'సాహో' తో పాటు 'రాధేశ్యామ్' చిత్రాలు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాయి. దీంతో ప్ర‌భాస్ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌ను న‌టించే సినిమాలవిష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక‌టి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఒక‌టి.

హార‌ర్ డ్రామా క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. అస‌లు ఈ చిత్రం తెర‌కెక్కుతున్నట్లు ఎలాంటి స‌మాచారాన్ని చిత్ర బృందం బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. అంత కామ్‌గా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. అయితే.. షూటింగ్‌లో ప్ర‌భాస్ ఉన్న‌ ఓ ఫోటో లీకైంది. ఆ ఫోటోలో ద‌ర్శ‌కుడు మారుతి ప‌క్క‌న ప్ర‌భాస్ కూర్చుని ఉన్నాడు.ఇందులో ప్ర‌భాస్ లుక్ చాలా కొత్త‌గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ వింటేజ్ లుక్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. రాజా డీల‌క్స్ అనే థియేట‌ర్ చుట్టూ తిరిగే తాతా మ‌న‌వ‌ళ్ల క‌థ‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంద‌ని అంటున్నారు. ప్ర‌భాస్‌కు జోడిగా మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్ న‌టిస్తుండ‌గా, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Next Story