షాకింగ్.. ఆన్‌లైన్‌లో 'ఆదిపురుష్' సినిమా లీక్

రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన భారీ అంచనాల చిత్రం 'ఆదిపురుష్' ఈరోజు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే పైరసీ బారిన

By అంజి  Published on  16 Jun 2023 2:41 PM IST
Prabhas, Adipurush, movie leake, Tollywood

షాకింగ్.. ఆన్‌లైన్‌లో 'ఆదిపురుష్' సినిమా లీక్ 

రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన భారీ అంచనాల చిత్రం 'ఆదిపురుష్' ఈరోజు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే పైరసీ బారిన పడింది. ఈ దురదృష్టకర సంఘటనతో చిత్రయూనిట్‌ కలత చెందుతోంది. తాజా రిపోర్ట్స్‌ ప్రకారం.. Tamilrockers, Filmyzilla, Moviesrulzతో సహా అనేక పైరేటెడ్ వెబ్‌సైట్‌లు గంటల వ్యవధిలో 1080p నుండి 240p వరకు వివిధ రిజల్యూషన్‌లలో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ కోసం పూర్తి మూవీని అందుబాటులో ఉంచాయి. 'ఆదిపురుష్' లీక్ సినిమా వర్గాలను నిరాశపరిచింది. ఇది సినిమా బాక్సాఫీస్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. హిందూ ఇతిహాసం రామాయణంపై ఆధారపడిన ఓం రౌత్ చిత్రం, దాని విజువల్ ఎఫెక్ట్‌ల విమర్శల కారణంగా ఇప్పటికే నిర్మాణ సవాళ్లను ఎదుర్కొంది. వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ పెంచడం ద్వారా చిత్రనిర్మాతలు సినిమా మళ్లీ తీర్చి దిద్దారు.

అయితే ఇప్పుడు పైరసీ కూడా సినిమాకు ఆర్థిక ఇబ్బందులను పెంచింది. ఇది నిస్సందేహంగా దాని సినిమా బిజినెస్‌పై ప్రభావం చూపుతుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ విషయంలో సినిమా విడుదల తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. అన్ని భాషల్లో కలిపి 150 కోట్లకు పైనే ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. ఇవాళ విడుదలైన ఆదిపురుష్.. 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే అందరూ కూడా పైరసీ వంటి దుర్మార్గపు చర్యలను గట్టిగా తిరస్కరించవలసి ఉంటుంది. థియేటర్లలో మాత్రమే సినిమాలను వీక్షించి సినీ పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ఎంతో ఉత్తమం. భారతదేశంలో పైరసీ తీవ్రమైన నేరమని గుర్తుంచుకోవడం ముఖ్యం. సినిమా తీయడానికి వెచ్చించే సమయం, అంకితభావం, శ్రమను మనం గౌరవించాల్సి ఉంటుంది.

Next Story