పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే..'ఓజీ' సెట్‌లోకి పవర్‌స్టార్ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తోన్న 'ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 14 May 2025 2:34 PM IST

Cinema News, Tollywood, Entertainment, Powerstar Pawankalyan, OG Movie

పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే..'ఓజీ' సెట్‌లోకి పవర్‌స్టార్ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తోన్న 'ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అసలైన ఓజీ సెట్‌లోకి అడుగుపెట్టారు..అని ట్వీట్ చేసింది.

ఇప్పటికే 'హరిహర వీరమల్లు' సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు 'ఓజీ' సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. పవన్ కల్యాణ్ డేట్స్ కోసమే చిత్ర బృందం వేచి చూసినట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలు మినహా, మిగిలిన నటీనటుల భాగాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్‌తో సినిమా మొత్తం చిత్రీకరణను ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కల్యాణ్ అత్యంత పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Next Story