'ఓజీ' ఓటీటీ డీల్ ఇంత భారీ మొత్తంలో జరిగిందా?

ఈ మధ్య తెలుగు సినిమాల ఓటీటీ రైట్స్ కి భారీగా డిమాండ్ ఉంది

By Medi Samrat  Published on  7 Jun 2024 7:18 PM IST
ఓజీ ఓటీటీ డీల్ ఇంత భారీ మొత్తంలో జరిగిందా?

ఈ మధ్య తెలుగు సినిమాల ఓటీటీ రైట్స్ కి భారీగా డిమాండ్ ఉంది. మంచి క్రేజీ ప్రాజెక్టుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పుష్ప-2, కల్కి, దేవర సినిమాల విషయంలో భారీ డీల్స్ జరిగాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'OG' విషయంలో కూడా భారీ హైప్ ఉంది. 'DVV ఎంటర్‌టైన్‌మెంట్' తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సాహో (2019) ఫేమ్ సుజీత్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నాడు.


ఈ సినిమా మీద విపరీతమైన హైప్‌ ఉండగా.. నెట్‌ఫిక్స్ OG డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకొందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంది. ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా 90 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉందని అంటున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వలన 2025కి వాయిదా పడింది. OGలో ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హస్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.


Next Story