ల‌గ్జ‌రీ కారు బుక్ చేసిన ప‌వ‌న్.. ధ‌ర ఎంతో తెలిస్తే షాకే..!

Power star Pawan Kalyan booked costly car.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్‌. తాను సెల‌బ్రెటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 4:20 AM GMT
ల‌గ్జ‌రీ కారు బుక్ చేసిన ప‌వ‌న్.. ధ‌ర ఎంతో తెలిస్తే షాకే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్‌. తాను సెల‌బ్రెటీ అన్న విష‌యాన్ని కూడా మ‌రిచి నిరాడంబ‌ర‌మైన జీవితం గ‌డుపుతుంటారు. ఇక ప‌వ‌న్‌కు హంగులు, ఆర్భాటాలు ఏ మాత్రం న‌చ్చ‌వు. పెద్ద పెద్ద బంగ్లాల‌లో క‌న్నా.. ప‌చ్చ‌ని ప్ర‌కృతి మ‌ధ్య ఉండ‌డానిక‌కే ప‌వ‌న్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై స్పందించే విదంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. 'వకీల్ సాబ్' అనంతరం వరుసగా నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్‌కు సంబంధించిన ఓవార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పవర్ స్టార్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ కారుని బుక్ చేశార‌ట‌.దీని ఖ‌రీదు 4 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుందని టాక్. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌లో కొంద‌రికి మాత్ర‌మే ఇలాంటి ల‌గ్జ‌రీ కారు ఉండ‌గా.. ఇప్పుడు ప‌వ‌న్ కూడా వారి జాబితాలో చేరాడు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఎక్కువ దూరం ప్ర‌యాణాల‌కి ఇది సౌక‌ర్యవంతంగా ఉంటుంద‌నే ఉద్దేశ్యంతోనే కాస్ట్ లీ కారు కొనుగోలు చేశార‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే. ప‌వ‌న్‌ 27వ సినిమా 'హరి హర వీరమల్లు' పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. తర్వాత రానాతో కలిసి మలయాళీ సూపర్‌హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. తర్వాత 'గబ్బర్ సింగ్' హరీష్ శంకర్‌తో సినిమా చెయ్యబోతున్నారు ప‌వ‌న్‌.

Next Story