సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఏమిటో చెప్పిన పోసాని
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 April 2024 2:45 PM ISTసినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఏమిటో చెప్పిన పోసాని
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఒకప్పుడు ఫేమస్ రైటర్ ఆయన.. డైరెక్టర్ గా కూడా మంచి సినిమాలను తీశారు. ఇక తన హాస్య, విలనీ పాత్రలలో కూడా పేరు సంపాదించాడు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పోసాని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిబద్ధతపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో జరిగిన గొడవను కూడా పోసాని బయటపెట్టారు. పోసాని సెట్ నుంచి వెళ్లిపోయే సమయానికి కూడా పవన్ కళ్యాణ్ సెట్స్ కు హాజరు కాలేదని చెప్పాడు. దీంతో పోసాని తన టైమ్ అయిపోయిందని వెళ్లిపోవడంతో ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ పోసానిని పిలిచి విచారించారు. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో సెట్‌కి సమయానికి రాకపోవడంతో పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోసాని ఆ సినిమా నుంచి తప్పుకున్నానన్నారు.
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించే వారిని చాలా మందే చూశాం. అయితే తన సినిమాల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా పవన్ వ్యవహరిస్తారా అని అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్‌కి పవన్ కళ్యాణ్ కూడా నిర్మాత. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ తన సమయాన్ని సినిమాలకు కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నా.. అది అసాధ్యంగా కనిపిస్తోంది. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కు తగ్గ సరైన హిట్ లేదు. కంప్లీట్ హిట్ అత్తారింటికి దారేది సినిమా అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితాలు రాబట్టలేక పోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి.