సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై కమెడియన్‌ పృథ్వీ

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 10 May 2023 3:22 PM IST

Tollywood ,comedian Prithviraj

సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై కమెడియన్‌ పృథ్వీ

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 30ఇయర్స్ పృథ్వీ దర్శకుడిగా మారి ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్‌ మీదున్న ఆయన మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేశాను. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా. ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమాకి అందరి ఆశీస్సులు కావాలి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు పృథ్వీరాజ్‌.

Next Story