ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ కనకరత్నం (94) ఇవాళ అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలియడంతో అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. కనకరత్నం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య భార్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవికి అత్త కాగా రామ్‌చరణ్‌కు అమ్మమ్మ. దీంతో మైసూరులో ఉన్న రామ్‌చరణ్ హైదరాబాద్‌కు వస్తున్నారు.
ఆమె భౌతికకాయం ఉదయం 9:00 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సాయంత్రం నాటికి కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నేతలు అల్లు కనకరత్నం మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రభుత్వ విధులపై వైజాగ్‌లో ఉన్నందున, వారు రేపు అల్లు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.