టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్‌రెడ్డి హార్ట్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో దిగ్భ్రాంతి నెలకొంది. తెలుగు చిత్రసీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రఘునాథ్ రెడ్డి, నెగటివ్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు.
దాదాపు 370కు పైగా సినిమాల్లో నటించి తన విశేష నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల చిత్రాల్లోనూ నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలల క్రితమే రఘునాథ్ రెడ్డి కుమారుడు కూడా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు సమాచారం.