ఇక చాలు.. ఇప్ప‌టికైనా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి : పూన‌మ్ కౌర్‌

Poonam Kaur clarity on having kids.సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎంతో మంది త‌మ భావాల‌ను, అనుభ‌వాల‌ను ఇంకా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 3:26 PM IST
ఇక చాలు.. ఇప్ప‌టికైనా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి : పూన‌మ్ కౌర్‌

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎంతో మంది త‌మ భావాల‌ను, అనుభ‌వాల‌ను ఇంకా ఎన్నో విష‌యాల‌ను వ్య‌క్త ప‌రుస్తున్నారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌టి న‌మ్మ‌డానికి వీలులేకుండా ఉంది. ఏది నిజం ఏదీ అబ‌ద్ద‌మో చాలా వ‌ర‌కు తెలియ‌డం లేదు. ఇక సినీ న‌టుల‌పై వ‌చ్చే వ‌దంతులు ఎన్నో. దీంతో ఆయా న‌టీన‌టులు ఇబ్బందులు ప‌డుతుంటారు. 'ఇప్ప‌టి వ‌ర‌కు న‌న్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇక‌నైనా న‌న్ను ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి' అని అంటోంది న‌టి పూన‌మ్ కౌర్‌.

పూన‌మ్ కౌర్.. ఇటీవ‌ల ఓ ఇద్ద‌రు చిన్నారుల‌తో క‌లిసి ఫోటోలు దిగి సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. అయితే.. ఆ ఫోటో చూసిన నెటీజ‌న్లు ఆ చిన్నారులు ఎవ‌రు మేడ‌మ్..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అయితే.. కొంద‌రు పూన‌మ్‌కి పెళ్లైంద‌ని, వాళ్లిద్ద‌రూ ఆమె పిల్ల‌లేన‌ని కామెంట్లు చేశారు. కొన్ని వెబ్‌సైట్లు, ప‌త్రిక‌ల్లో ఈ వార్త‌లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల‌పై పూన‌మ్ స్పందించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన పూన‌మ్ కౌర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 'న‌న్ను ఇంత‌కాలం ఇబ్బంది పెట్టింది, నా ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించింది చాలు. నేను షేర్ చేసిన ఫోటోలో ఉన్న చిన్నారులు నాకెంతో ఇష్ట‌మైన స్నేహితుల పిల్ల‌లు. థ్యాంక్యూ సోష‌ల్ మీడియా. ఇక‌పై న‌న్ను ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి' అంటూ పూన‌మ్ రాసుకొచ్చింది.

Next Story