హమ్మయ్య.. బుట్టబొమ్మ చేతిలోకి ఒక క్రేజీ ప్రాజెక్ట్

టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజ హెగ్డేను వరుస పరాజయాలు పలకరించాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2024 2:15 PM IST
pooja hegde, tollywood,  movies,

హమ్మయ్య.. బుట్టబొమ్మ చేతిలోకి ఒక క్రేజీ ప్రాజెక్ట్

టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజ హెగ్డేను వరుస పరాజయాలు పలకరించాయి. ఇటు టాలీవుడ్ లోనూ.. అటు బాలీవుడ్ లోనూ బుట్ట బొమ్మ ఫ్లాప్ లను చవి చూసింది. దీంతో సినిమాలకు దాదాపు ఏడాదికి పైగా బ్రేక్ ఇచ్చింది పూజ హెగ్డే. సైలెంట్ గా ఉంటే సరిపోదని అనుకుందో ఏమో.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలను చేయడానికి సిద్ధమైంది. అనేక పరాజయాలను ఎదుర్కొన్న పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ యొక్క కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (2023)లో కనిపించింది. తాజాగా అక్కినేని నాగ చైతన్య సినిమాలో పూజా హెగ్డే నటించబోతోంది తెలుస్తోంది. నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో చేతులు కలిపాడు. తాజా నివేదికల ప్రకారం.. గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్‌గా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

పూజా హెగ్డే ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కూడా చేస్తోంది. ‘దేవా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోలీవుడ్‌కు చెందిన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించనున్నారు. పూజ హెగ్డేకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొత్త ఆఫర్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే పూజ హెగ్డేకు సక్సెస్ మాత్రం చాలా ముఖ్యం.

Next Story