టాలీవుడ్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా.. టాప్ హీరోయిన్‌కు పాజిటివ్‌

Pooja Hegde gets Covid Positive. తాజాగా బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

By Medi Samrat  Published on  26 April 2021 7:45 AM IST
Pooja Hegde

టాలీవుడ్‌ను క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే చాలా మంది న‌టులు క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌య‌మై పూజా హెగ్డే త‌నకు క‌రోనా సోకింద‌ని త‌న‌ సోష‌ల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్ల‌డించింది.

అంద‌రికి న‌మ‌స్కారం. నాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన వారంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోండి. మీరు చూపిస్తున్న ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు ధ‌న్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ పూజా పోస్ట్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే.. పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌ల ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అమ్మ‌డు.. అక్కినేని అఖిల్ స‌ర‌స‌న‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రంలోను న‌టించింది. ఇక‌ త‌మిళ హీరో విజ‌య్ 65వ సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే.. బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న‌ స‌ర్క‌స్ చిత్రంలో న‌టిస్తుంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సినిమాలోను న‌టిస్తుంది.



Next Story