న‌టుడు అర్జున్ స‌ర్జాకు ఊర‌ట‌.. మూడేళ్ల త‌రువాత క్లీన్‌చిట్

Police give clean chit to actor Arjun Sarja.ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జాకు ఊర‌ట ల‌భించింది. లైంగిక వేదింపుల కేసులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 3:09 PM IST
న‌టుడు అర్జున్ స‌ర్జాకు ఊర‌ట‌.. మూడేళ్ల త‌రువాత క్లీన్‌చిట్

ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జాకు ఊర‌ట ల‌భించింది. లైంగిక వేదింపుల కేసులో అత‌డికి క్లీన్ చిట్ ల‌భించింది. మీటూ ఉద్య‌మంలో భాగంగా న‌టి శృతి హ‌రిహ‌ర‌న్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మూడేళ్ల క్రితం అర్జున్‌పై కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసులో సాక్ష్యులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయిన‌ట్లు బెంగ‌ళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు.

'విస్మయ' కన్నడ సినిమా షూటింగులో రిహార్సల్ వంక‌తో అర్జున్‌ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని న‌టి శృతి హ‌రిహ‌ర‌న్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. నటి ఆరోపణలతో కర్ణాటకలో అర్జున్ సర్జా అభిమానులు నిరసనలకు దిగారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఆఫ్​సీసీ) జోక్యం చేసుకుని సమస్యను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ సమావేశానికి హాజరైన శృతి హరిహరన్.. తన ఆరోపణలను పునరుద్ఘాటించారు.

దీనిపై కేసు న‌మోదు చేసిన క‌ర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచార‌ణ అనంత‌రం అర్జున్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. అర్జున్​ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. శృతి హరిహరన్ కూడా ఇప్పటివరకు రుజువులను సమర్పించలేకపోయింది. దీంతో ఈ కేసులో నటుడు అర్జున్​పై అభియోగాలు మోపడానికి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని అడిషనల్​ చీఫ్ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​కు పోలీసులు తెలిపారు.

Next Story