సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు..!

Police complaint against Singer Mangli.త‌న పాట‌ల‌తో మంచి పేరు తెచ్చుకుంది సింగ‌ర్ మంగ్లీ. కేవలం సినిమాల్లోని పాటల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 8:39 AM IST
సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు..!

త‌న పాట‌ల‌తో మంచి పేరు తెచ్చుకుంది సింగ‌ర్ మంగ్లీ. కేవలం సినిమాల్లోని పాటలనే కాకుండా దసరా, బతుకమ్మ, శివరాత్రి వంటి పండగ పర్వదినాలకు సంబంధించి కూడా మంగ్లీ ప్రత్యేకమైన పాటలు పాడుతుంటుంది. ఈమె పాడే ప్రత్యేక భక్తి గీతాలకు యూట్యూబ్‌లో ఇప్పటికే లక్షలాది మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ ఏడాది బోనాలకు సంబంధించి కూడా మంగ్లీ ఓ ప్రత్యేకమైన పాటను పాడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ పాట‌నే ఇపుడు వివాదానికి కారణమైంది.

బోనాల పాట‌లో త‌ప్పుడు ప‌దాలు ఉప‌యోగించార‌ని మంగ్లీపై బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. బోనాల సందర్భంగా అమ్మవారిపై మంగ్లీ పాడిన పాటల్లో కొన్ని తప్పుడు పదాల ఉపయోగించరాని వాటిని సామాజిక మాధ్యమాల్లోంచి వెంటనే తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రాజకొండ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఈ పాటపై ఫిర్యాదు చేశారు. ఆమె పాడిన పాటను సామాజిక‌ మాధ్యమాల నుంచి తొలిగించాలని అందులో పేర్కొన్నారు. కాగా.. ఈ పాటకు రామస్వామి లిరిక్స్, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్‌పై కూడా తానే కనిపించారు. ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనూ మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది.

Next Story