మ‌ద్యం మ‌త్తులో షణ్ముఖ్ ర‌చ్చ ర‌చ్చ‌.. అరెస్టు

Police case filed against Shanmukh Jaswanth.షార్ట్ ఫిల్స్మ్‌‌లో న‌టిస్తూ ప్ర‌జ‌లు నీతులు చెబుతారు. కానీ మ‌ద్యం మ‌త్తులో ఓ యూట్యూబ్ స్టార్‌.. కారు డ్రైవింగ్ చేసి రచ్చ ర‌చ్చ చేశాడు. రెండు కార్లతో పాటు ఓ బైక్‌ను ఢీ కొట్టాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 3:28 AM GMT
Police case filed against Shanmukh Jaswanth

షార్ట్ ఫిల్స్మ్‌‌లో న‌టిస్తూ ప్ర‌జ‌లకు నీతులు చెబుతారు. కానీ నిజ జీవితంలోకి వ‌చ్చే స‌రికి వారు చెప్పిన వాటిని వారే పాటించరు. మ‌ద్యం మ‌త్తులో ఓ యూట్యూబ్ స్టార్‌.. కారు డ్రైవింగ్ చేసి రచ్చ ర‌చ్చ చేశాడు. రెండు కార్లతో పాటు ఓ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్రమాదానికి కార‌ణ‌మైన యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముఖ్‌ జ‌శ్వంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎస్సై న‌వీన్ రెడ్డి క‌థ‌నం ప్ర‌కారం.. యూట్యూబ్ స్టార్‌గా పేరున్న ష‌ణ్ముఖ్ శ‌నివారం మ‌ధ్యాహ్నం కారులో వెళుతూ.. జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్టు కాల‌నీలో ఉడ్స్ గేటెడ్ క‌మ్యూనిటీ స‌మీపంలో ఒక్క‌సారిగా వేగం పెంచాడు. ముందున్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అనంత‌రం బైక్ పై వెలుతున్న వ్య‌క్తిని ఢీ కొట్టాడు.

ఈ ఘ‌ట‌న‌లో బైక్ పై వెలుతున్న వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. స్థానికులు వెంట‌నే కారును అడ్డుకున్నారు. 108కి స‌మాచారం ఇచ్చి గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ష‌ణ్ముఖ్‌ను ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. స్టేష‌న్‌కు వ‌చ్చిన త‌రువాత‌ బ్రీత్ ఎనలైజర్‌తో ప‌రీక్ష‌లు నిర్వహించ‌గా.. అత‌డి ర‌క్తంలో మ‌ద్యం మోతాదు శాతం 170ఎంఎల్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story