నేను చాలా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉన్నా: సుధాకర్

టాలీవుడ్ దిగ్గజ క‌మెడియ‌న్ సుధాక‌ర్ చ‌నిపోయిన‌ట్లు ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2023 5:30 PM IST
actor Sudhakar, Tollywood, Sudhakar Health

నేను చాలా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉన్నా: సుధాకర్ 

టాలీవుడ్ దిగ్గజ క‌మెడియ‌న్ సుధాక‌ర్ చ‌నిపోయిన‌ట్లు ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్త‌ల‌పై సుధాక‌ర్ స్పందించారు. ఈ మేర‌కు ఓ వీడియో కూడా ఆయ‌న విడుద‌ల చేశారు. సుధాక‌ర్ ఆరోగ్యం బాలేద‌ని, ఐసీయూలో ఉన్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఫేక్ న్యూస్‌ను న‌మ్మొద్ద‌ని, ఇలాంటి పుకార్లు సృష్టించొద్ద‌ని కోరారు. నా మీద కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలని.. త‌ప్పుడు స‌మాచారాన్ని న‌మ్మ‌కండి. ఇలాంటి పుకార్ల‌ను ప్ర‌చారం చేయ‌కండని అన్నారు. నేను చాలా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉన్నాను అని సుధాక‌ర్ పేర్కొన్నారు.

సుధాక‌ర్ తెలుగు, తమిళ ఇండ‌స్ట్రీలో.. కొన్ని సినిమాల్లో హీరోగా కనిపించారు. ఆ తర్వాత కమెడియన్ గా ఎన్నో సినిమాలలో ఆకట్టుకున్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న సుధాక‌ర్ ఆరోగ్యంపై గ‌తంలోనూ పుకార్లు వ‌చ్చాయి. ఎప్పటికప్పుడు ఆ వార్తలను సుధాకర్, ఆయన కుటుంబం ఖండిస్తూ వస్తున్నారు.

Next Story